- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుపతిలో మహాకుంభ్ ఆఫ్ టెంపుల్స్ కార్యక్రమం... సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తిరుపతిలో నిర్వహించిన మహాకుంభ్ ఆఫ్ టెంపుల్స్ కార్యక్రమంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో మహాకుంభ్ ఆఫ్ టెంపుల్స్(Tirupati Temples Mahakumbh) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) కీలక వ్యాఖ్యల చేశారు. తిరుపతిలో కుంభ్ ఆఫ్ టెంపుల్స్ నిర్వహించడాన్ని ఆయన ఆహ్వానించారు. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ మేళా(Mahakumbh Mela) వైభవంగా జరుగుతోందన్నారు. మొదటి కుంభ్ ఆఫ్ టెంపుల్స్ కాశీ(Kasi)లో నిర్వహించారని తెలిపారు. దేవాలయాల నిర్వహణ, టెంపుల్ టూరిజంపై చర్చించారని చెప్పారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదని, అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరులన్నారు. టెంపుల్ టూరిజం దేశాభివృద్ధిలో ప్రత్యేక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ప్రతి ఇంట్లో ఒక ఏఐ నిపుణుడు తయారవుతున్నాడని చంద్రబాబు పేర్కొ్న్నారు. టెక్నాలజీ వినియోగంలో మరింత ముందుకెళ్లాలని సూచించారు. ఆధ్యాత్మికతవైపు అందరూ అడుగులు వేస్తున్నారని, ఎందరో భక్తులు దేవాలయాలకు కోట్ల విరాళాలు ఇస్తున్నారని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రంలో భక్తులు ఇస్తున్న విరాళాలను పేదలకు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. మనదేశానికి కుటుంబ వ్యవస్థ అతిపెద్ద బలం అని తెలిపారు. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణలో దేవాలయాలది ప్రధాన పాత్ర అన్నారు. ఏపీ ఆలయాల్లో అన్నదానం కార్యక్రమాన్ని నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Ramarao) ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రతి రోజూ లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదం అందుతోందని చెప్పారు. దేశ విదేశాల్లో వెంకటేశ్వరస్వామి ఆలయాలు పెరుగుతున్నాయని, ఇంకా పెరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దేశానికి సరైన సమయంలో ప్రధానిగా మోడీ(Pm Modi) ఉన్నారని చెప్పారు. టెక్నాలజీ వినియోగంలో భారతీయులు చాలా ముందున్నారని, యువత ఎక్కువగా ఉండటం కూడా ఒక అద్భుతమన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారతదేశం నెంబర్ వన్ లేదా నెంబర్ టుగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు.






