సీఎం చంద్రబాబు శుభవార్త.. నామినేటెడ్ పోస్టులపై కీలక ప్రకటన

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu) కీలక ప్రకటన చేశారు. ఏపీలో మరికొన్ని నామినేటెడ్

సీఎం చంద్రబాబు శుభవార్త.. నామినేటెడ్ పోస్టులపై కీలక ప్రకటన
X

*నామినేటెడ్ పోస్టులపై చంద్రబాబు ప్రకటన*

*ఈ నెలాఖరుకు ముహూర్తం ఫిక్స్*

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu) కీలక ప్రకటన చేశారు. ఏపీలో మరికొన్ని నామినేటెడ్ పోస్టులు ( Nominated posts) భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈనెల చివరలో ఏపీలో మిగిలిన అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. దేవాలయాల పాలక మండళ్లు, మార్కెట్ యాడ్ చైర్మన్ ల పదవులను భర్తీ చేస్తామని వెల్లడించారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చాలామంది టీడీపీ నాయకులు ఈ నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి అధికారంలోకి రావడానికి మూడు పార్టీల నేతలు కష్టపడడంతో... అందరి చూపు ఈ పదవుల పైనే ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చాలా మందికి పదవులు రావడం లేదు.

ఈ నేపథ్యంలోనే చాలామంది అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ కొంత మంది నేతలకు మాత్రం పదవులు దక్కుతున్నాయి. అయితే... ఆశవహులు విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఈ నెల ఆఖరిలోపు... మిగిలిన అన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకే చంద్రబాబు నాయుడు ( Cm Chandrababu) కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. అటు జనసేనతో ( JANASENA) పాటు భారతీయ జనతా పార్టీ ( Bharatiya Janata Party ) నేతలు కూడా... ఈ పదవులు ఎప్పుడు వస్తాయని చూస్తున్నారు.

Next Story