CM Chandrababu: ప్రభుత్వం గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ పై కీలక ప్రకటన

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-31 08:16:13  IST  )

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధి(State Development) దిశగా అడుగుల వేస్తోంది.

CM Chandrababu: ప్రభుత్వం గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ పై  కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధి(State Development) దిశగా అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు హామీలను అమలు చేసిన సంగతి విదితమే. ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబు ఇవాళ(శుక్రవారం) కూటమి నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉందని చెప్పారు. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరుగనున్నాయి. ఫలితాలు మార్చి 3న వెలువడనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో గాడితప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామనే విషయాన్ని ప్రజల్లోకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రం(Andhra Pradesh)లో రాత్రికి రాత్రే అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయని చెప్పట్లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల గురించి ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఎన్నికలు ఏవైనా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. డీఎస్సీ నోటిఫికేషన్ తప్పకుండా ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు( MLC election) ముగియగానే 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే నెలలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduate MLC election) ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్‌లను భారీ మెజార్టీతో గెలిపించాలని కూటమి నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు.

Next Story