- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Chandrababu: నిర్వాసితులను చూస్తే బాధేస్తోంది.. భావోద్వేగానికి గురైన సీఎం చంద్రబాబు
పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) పనులను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) గురువారం పోలవరంకు చేరకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) పనులను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) గురువారం పోలవరంకు చేరకున్నారు. ముందుగా ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఇంచార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం నిర్వాసితులు వేల ఎకరాల్లో భూములు త్యాగం చేశారని గుర్తు చేశారు. భూములు ఇచ్చినోళ్లను గత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఫైర్ అయ్యారు.
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్వాసితులకు రూ.4,311 కోట్లు చెల్లించామని అన్నారు. కానీ, వైసీపీ ప్రభుత్వం (YCP Government) నిర్వాసితులకు రూ.10 లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి.. పట్టించుకున్న పాపాన పోలేదని కామెంట్ చేశారు. నిర్వాసితులను చూస్తే తనకు బాధేస్తోందని.. వరదలు వచ్చినా గత ప్రభుత్వం ఇటు వైపు కూడా చూసిన దాఖలాలు లేవన్నారు. నిర్వాసితులను ఆదుకున్న ప్రభుత్వం తమదేనని అన్నారు. 2019లో టీడీపీ (TDP) ఆధికారంలో కొనసాగి ఉంటే.. 2020లోనే పోలవరం పూర్తయ్యేది తెలిపారు. ఎప్పుడో పూర్తి కావాల్సి ప్రాజెక్టును జగన్ సర్కార్ మరుగును పడేసిందని.. ఇప్పుడు ప్రాజెక్ట్ ఆలస్యమై.. ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. 2014-2019 మధ్య మొత్తం 33 సార్లు ప్రాజెక్ట్‌ను సందర్శించానని అన్నారు. పోలవరం నిధులను గత సర్కార్ యథేచ్ఛగా దారి మళ్లించిందని ఆరోపించారు. 2027 నాటికి పునరావాసం పూర్తి చేస్తామని.. నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వదుతామని స్పష్టం చేశారు. అదేవిధంగా అధికారులు ప్రతి ఒక్కరికి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వేదిక పైనుంచే ఆదేశాలు జారీ చేశారు. తమ ప్రభుత్వం వచ్చిందని.. అందరికీ న్యాయం చేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.






