అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం !

by velandi.Saikiran |

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం !
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఆలస్యంగా వచ్చి, అసెంబ్లీ సమావేశాలు పూర్తికాక ముందే వెళ్తున్న ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియ‌స్ అయ్యారు. కీలక చర్చల సమయంలో సభ్యుల గైర్హాజరుపై అసంతృప్తి వ్య‌క్త చేశారు బాబు. ఈ సమావేశం ప్రారంభమయ్యే సమయానికి శాసన సభలో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని స‌మాచారం. ఈ మేర‌కు అసెంబ్లీలో విప్‌లను అప్రమత్తం చేశారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.

సీఎం చంద్ర‌బాబు ఆరా తీయడంతో.. సమావేశానికి డుమ్మా కొట్టిన 17 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి అప్పటికప్పుడు పిలిపించారు విప్‌లు. పూర్తి స్థాయిలో సభ్యులు హాజరయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చార‌ని స‌మాచారం అందుతోంది. ఇక అటు వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరు మార్పుపై అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రతిపాదనలు పెట్టారు. తాడిగడప మున్సిపాలిటీగా పేరు మారుస్తూ మంత్రి నారాయణ తీర్మానం పెట్టారు. సభలో ఎలాంటి వ్యతిరేకత లేకపోవడంతో ప్రతిపాదనను ఆమోదించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

Next Story