- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైఎస్ షర్మిలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్
వైఎస్ షర్మిల పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థిస్తున్నానంటూ పోస్ట్ చేశారు సీఎం చంద్రబాబు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై ఆసక్తికర ట్విట్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇవాళ వైఎస్ షర్మిల పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేతలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలుగురు రాజకీయ నాయకులు వైఎస్ షర్మిలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేసి షర్మిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమెకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థిస్తున్నానంటూ పోస్ట్ చేశారు సీఎం చంద్రబాబు.
ఇక అటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు B. రామచంద్ర రాజు మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కు వీరాభిమానిగా, అఖిలభారత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా పనిచేసి 'ఎన్టీఆర్ రాజు'గా పిలిపించుకున్న రామచంద్ర రాజు పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ ఎమోషనల్ అయ్యారు. ఆయన ఆత్మశాంతికై ప్రార్థిస్తూ... వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. క్లిక్






