విద్యా సంస్థలకు సెలవు ప్రకటించండి: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

by Vemula.Srinu Prasad |

తుపాను నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు..

విద్యా  సంస్థలకు సెలవు ప్రకటించండి: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రానికి 'మొంథా' తుపాను పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 26, 27, 28, 29వ తేదీల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ముందస్తు జాగ్రత్తలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకూ ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా సన్నాహక చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Next Story