రంజాన్ వేళ ముస్లింలకు సీఎం గుడ్ న్యూస్.. ఇఫ్తార్ విందులో ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-16 13:51:33  IST  )

రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు కూటమి ప్రభుత్వం విజయవాడలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ...

రంజాన్ వేళ ముస్లింలకు సీఎం గుడ్ న్యూస్.. ఇఫ్తార్ విందులో ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: రంజాన్(Ramadan) మాసం సందర్భంగా ముస్లింలకు కూటమి ప్రభుత్వం విజయవాడ(Vijayawada)లో ఇఫ్తార్ విందు(Iftar Fest) ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తానెప్పుడూ మైనార్టీల పక్షాన ఉంటానని చెప్పారు. దశాబ్దకాలంగా ఇఫ్తార్‌ విందు ఇస్తున్నామని, ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లోనూ చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం మైనార్టీలకు పెద్దఎత్తున సంక్షేమం అందిస్తోందన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామని తెలిపారు. ఇమామ్‌, మౌజమ్‌లకు గౌరవవేతనం ఇచ్చేందుకు తానే శ్రీకారం చుట్టానన్నారు. ఇమామ్‌, మౌజమ్‌ల బకాయిలను ఇవాళ రాత్రిలోపు నిధులు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


‘‘దూదేకుల ముస్లింల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాం. ఈద్గాలు, ఖబర్సాలకు భూములు ఇచ్చాం. ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారికి రూ.2.50 లక్షలు అందజేస్తున్నాం. మైనార్టీలను ఆర్థిక ఆదుకేనేందుకు చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆటోనగర్‌లను ఏర్పాటు చేసి తద్వారా మైనార్టీలకు ఉపాధి కల్పిస్తామన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడతాం. ఆ నిధులను ముస్లింల సంక్షేమానికే ఖర్చు చేస్తాం.’’ అని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

Next Story