నన్ను లేపేస్తావా..? ఇక్కడ ఉన్నది CBN.. జగన్‌పై చంద్రబాబు ఫైర్

by Ajay Maddhiboyina |

ఏపీ సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ప్రజల కోసం పనిచేయాలని అన్నారు.

నన్ను లేపేస్తావా..? ఇక్కడ ఉన్నది CBN.. జగన్‌పై చంద్రబాబు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ప్రజల కోసం పనిచేయాలని అన్నారు. వారి అంతిమ లక్ష్యం అధికారం అయినా కట్టుబాట్లు, పద్దతులు, నైతికవిలువలు తప్పనిసరిగా ఉండాలన్నారు. తనను చూసి వాటిని నేర్చుకోవాలన్నారు. కానీ జగన్ ను చూసి ఏం నేర్చుకుంటారని ప్రశ్నించారు.

గొడ్డలి పోట్లు, రప్పా రప్పా, బూతు పంచాంగం నేర్చుకుంటారా అని ప్రశ్నించారు. మావాళ్లకు చెబితే లేపేస్తారని అంటున్నారని..నువ్వు లేపేస్తావా.. ఇక్కడ ఉన్నది సీబీఎన్ అంటూ హెచ్చరించారు. తాను ఎంతో మందితో పోరాడానని చెప్పారు. తీవ్రవాదులు, కమ్యునల్ గొడవలు సృష్టించేవాళ్ల‌తో పోరాడానని అన్నారు. ఇప్పుడు నేర‌స్థులు రాజ‌కీయ ముసుగులో వ‌స్తున్నార‌ని, వాళ్ల ముసుగు తీసి నేర‌స్తుల‌ను నేర‌స్తులుగా ప‌రిగ‌నించాల‌ని చెబుతున్నాన‌ని అన్నారు.

Next Story