ఏమి చేసినా దేశాభివృద్ధిని ఆపలేరు: ట్రంప్‌నుద్దేశించి సీఎం చంద్రబాబు చురకలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-11 15:19:11  IST  )

ఏమి చేసినా దేశాభివృద్ధిని ఆపలేరని ట్రంప్‌నుద్దేశించి సీఎం చంద్రబాబు చురకలు అంటించారు..

ఏమి చేసినా దేశాభివృద్ధిని ఆపలేరు: ట్రంప్‌నుద్దేశించి సీఎం చంద్రబాబు చురకలు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా(America)కు భారతదేశ(India) ఎగుమతులపై ఆ దేశాధ్యక్షుడు ట్రంప్(Trump) సుంకాలు, టారీఫ్‌లు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈ విధింపుతో ఏపీలోని ఆక్వా రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని ప్రధాని మోడీ ద్వారా ట్రంప్‌కు చేరవేసినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. భారత్ ఎగుమతులపై సుంకాలు, టారీఫ్‌ల తగ్గింపులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ను ఉద్దేశించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలు, టారీఫ్‌లతో భారత దేశాభివృద్ధిని ఆపలేరని, కొందరు తాతాల్కికంగా ఇబ్బంది పెట్టొచ్చని ఆయన మండిపడ్డారు. దేశ సేవలు ప్రపంచానికి అవసరమని చెప్పారు. అందరితో మంచిగా, సఖ్యతగా ఉండాలనేది దేశం చేస్తున్న ఆలోచన అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Next Story