- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Chandrababu: సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్.. స్పాట్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఏపీ సెక్రటేరియట్ (AP Secretariat)లోని రెండో బ్లాక్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం విదితమే.

దిశ, వెబడెస్క్: ఏపీ సెక్రటేరియట్ (AP Secretariat)లోని రెండో బ్లాక్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం విదితమే. ఈ మేరకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. అయితే, ప్రమాదానికి గల కారణాలను సీఎం సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్, జీఏడీ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా వివరించారు. కాగా, ఫైర్ సిబ్బంది ఇప్పటికే మంటలను అదుపులోకి తీసుకురాగా.. పవర్ బ్యాక్‌అప్ కోసం బ్యాటరీలు భద్రపరిచే రూంలో మంటలు చెలరేగినట్లుగా అధికారులు సీఎం (CM)కు వివరించారు. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టంపై కూడా చంద్రబాబు (Chandrababu) ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన రెండో బ్లాక్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan)తో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, కందుల దుర్గేశ్, ఆనం రామనారాయణ రెడ్డి పేషీలు ఉన్నాయి.






