- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రోజు అక్రమంగా వ్యవహరించారు.. ఢిల్లీలో గుర్తు చేసుకుని ఫైర్ అయిన చంద్రబాబు
ఏ తప్పు చేయకపోయినా అరెస్ట్ చేశారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు..

దిశ, వెబ్ డెస్క్: తాను తప్పు చేయకపోయినా అరెస్ట్ చేశారని ఏపీ సీఎం చంద్రబాబు(Ap Cm Chandrababu) అన్నారు. ఢిల్లీ(Delhi) పర్యటనలో ఉన్న ఆయన జగన్(Jagan) ప్రభుత్వంలో తనను అరెస్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తనపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. రాష్ట్ర రాజధాని అమరావతి(Amaravati) విషయంలో జగన్ పాల్పడిన అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన మొదటి ప్రాధాన్యత అమరావతిని అభివృద్ధి చేయడమేనని చెప్పారు. ప్రధాని మోదీ(Pm Modi) పాలనలో భారతదేశం(India) మరింత అభివృద్ధి చెందుతోందని చెప్పారు. అమెరికా(America)తో పోల్చుకుంటే భారత్ జీడీపీ వృద్ధిరేటు బాగుందన్నారు. అప్పుడు ఐటీ.. ఇప్పుడు ఏఐపై మాట్లాడుతున్నారని తెలిపారు. హార్డ్ వర్క్ కాదని, స్మార్ట్ వర్క్ చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
అంతకుముందు ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ ఖట్టర్(Union Urban Development Minister Manohar Khattar)ను సీఎం చంద్రబాబు కలిశారు. రాష్ట్ర సామాజిక పరిస్థితితులతో పాటు ఆర్థిక, అభివృద్ధి, ప్రాజెక్టులపై ఆయనకు వివరించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు నిధుల మంజూరుకు కృషి చేయాలని వినతి పత్రం అందజేశారు.






