మెడికల్‌ కాలేజీలు కట్టే వారిని జైల్లో పెడతారా..?: సీఎం చంద్రబాబు ఆగ్రహం

by Vemula.Srinu Prasad |

మెడికల్‌ కాలేజీలు కట్టే వారిని జైల్లో పెడతారా..? అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు..

మెడికల్‌ కాలేజీలు కట్టే వారిని జైల్లో పెడతారా..?: సీఎం చంద్రబాబు ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati), పోలవరం(Polavaram), హైవేలు వంటి కీలక ప్రాజెక్టులకు మోడీ, కేంద్రం సహకరిస్తోందని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) తెలిపారు. రాష్ట్రం మొన్నటి వరకు వెంటిలేటర్‌పై ఉందని, ఇప్పుడు నిలదొక్కుకుని ముందుకెళ్తోందని ఆయన చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైసీపీ వ్యతిరేకించడంపై చంద్రబాబు మండిపడ్డారు. టెండర్లో పాల్గొనే వారికి వార్నింగ్ ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానం గురించి తెలియని వారు ప్రైవేట్‌ పరం అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం కూడా పీపీపీ విధానంపై స్పష్టంగా ఉందని, మెరుగైన సేవలు, ఉద్యోగాలు కల్పించాలంటే ఆ విధానం బెస్ట్‌ అని చెప్తోందని చంద్రబాబు తెలిపారు.

‘‘పీపీపీ పద్ధతిలో చేపట్టే మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ద్వారా ఆర్ధిక మద్దతు కూడా ఇస్తున్నాం. పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీలు కడితే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. అభివృద్ధి చేసే వారిని జైల్లో పెడతామనే వారిని ఏమనాలో ప్రజలే ఆలోచించుకోవాలి. 2047 నాటికి మనదేశం ప్రపంచలో నెంబర్‌ 1గా ఉండాలంటే.. దానికి ఏపీ ట్రెండ్‌ సెట్టర్‌గా ఉండాలని నేను ఆలోచన చేస్తున్నా. అలాంటి నేను రాష్ట్రంలోని అభివృద్ధి వ్యతిరేకులతో రాజకీయం చేయాల్సి వస్తోంది. ఎవరెన్ని చెప్పినా, అడ్డంకులు సృష్టించిన అభివృద్ధి ఆగదు. హెల్తీ, వెల్తీ, హ్యాపీని ఏపీని అందించేందుకు ఎన్టీఆర్, వాజ్‌ పేయ్‌ స్పూర్తితో ముందుకెళ్తా’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Next Story