అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం.. మళ్లీ జరగకూడదంటూ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-09 10:13:24  IST  )

తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు..

అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం.. మళ్లీ జరగకూడదంటూ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ‘మీ భూమి-మీ హక్కు’(Your land is your right) ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు పట్టా పాస్ పుస్తకాల(Farmer Pass Books) పంపిణీలో నిర్లక్యం వహించినందుకు ఆయన సీరియస్ అయ్యారు. ప్రభుత్వ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంకోసారి ఇలా చేస్తే కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం బాధ్యతగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

రాయవరం గ్రామ సభలో ..


తూర్పుగోదావరి జిల్లా రాయవరం(Rayavaram) గ్రామ సభలో రైతులకు పట్టా పాస్ పుస్తకాల పంపిణీలో అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 900 మంది పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేస్తే అంతమంది ఈ సభలో లేరని మండిపడ్డారు. గ్రామ సభల్లోనే ప్రజలకు పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇళ్లు, కార్యాయాల వద్ద పాస్ పుస్తకాలు పంపిణీ చేయొద్దన్నారు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా, రైతుల భూమి, వాళ్ల హక్కును నెరవేర్చే బాధ్యత అధికారులదని చెప్పారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని జేసీని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ప్రభుత్వ రాజముద్రతో పట్టా పాస్ పుస్తకాలు

కాగా రాజముద్ర వేసి కొద్ది రోజులుగా రైతులకు ప్రభుత్వ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తోంది. ఆయా జిల్లాల్లో, నియోజవకర్గా్ల్లోనూ ఈ కార్యక్రమం జోరుగా జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్యెల్యేలు పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలు అందిస్తున్నారు. అయితే కొందరు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రైతులకు పాస్ పుస్తకాలు అందించడంతో అలసత్వం వహిస్తున్నారు. దీంతో ఈ విషయం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆయన రాయవరంలో అధికారులపై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story