ఆధారాలు ఉంటే బయటపెట్టండి: జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఫైర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-03 11:41:52  IST  )

రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు....

ఆధారాలు ఉంటే బయటపెట్టండి: జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్సీ(Mega DSC)పై వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపైనే తొలిసంతకం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ జగన్‌పై విమర్శలు కురిపించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా డీఎస్సీని నిర్వహించామని తెలిపారు. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పోర్ట్స్ కోటా(Sports Quota)లో అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. అక్రమాలు జరిగాయని ఆధారాలు ఉంటే బయటపెట్టాలన్నారు. డీఎస్సీ నిర్వహణపై బుద్ధిలేకుండా కొందరు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైసీపీ(Ycp) వాళ్లు చేసే పనుల వల్ల ప్రజలు ఇబ్బందులపాలవుతున్నారని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Next Story