మంత్రులను అభినందించిన సీఎం చంద్రబాబు

by Thanuru Gopichand |

మొంథా తుఫాన్ రక్షణ చర్యల్లో అత్యుత్తమంగా పనిచేసిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు (CM Chandra Babu) అభినందించారు.

మంత్రులను అభినందించిన సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాన్ రక్షణ చర్యల్లో అత్యుత్తమంగా పనిచేసిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు (CM Chandra Babu) అభినందించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొంథా తుఫాను నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలో అత్యుత్తమంగా పనిచేసినందుకు మంత్రి కందుల దుర్గేష్ (Minister Durgesh) ను సీఎం చంద్రబాబు నాయుడు ఘనంగా సన్మానించారు. తుఫాను సమయంలో ప్రదర్శించిన అంకితభావం, నాయకత్వం, ప్రజలను సంసిద్ధులను చేయడం, సహాయక చర్యలలో అవిశ్రాంత కృషికి గుర్తింపుగా సైక్లోన్ మొంథా ఫైటర్ గా గౌరవిస్తూ మెమొంటోతో పాటు సన్మాన పత్రం అందించారు.

మొంథా తుఫాన్ లో మెరుగైన సేవలు అందించిన రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ (Minister Vasamsetti Subash) ను సీఎం చంద్రబాబు ప్రశంసా పత్రం, జ్ఞాపికతో సత్కరించారు. అటు కోనసీమ జిల్లాలోనూ, ఇన్చార్జి మంత్రిగా ఉన్న కృష్ణా జిల్లాలోనూ తీసుకున్న మెరుగైన తుఫాను సహాయక చర్యలు పట్ల సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి విపత్కర సమయంలో పౌరుల భద్రత, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నిబద్ధతతో ప్రజా సేవ అత్యున్నత ప్రమాణాలకు నిదర్శనంగా నిలిచిన మంత్రుల సేవలను సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడుతూ హృదయపూర్వకంగా ప్రశంసించారు.

Next Story