తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

by Malleboina Mahesh |   (  Updated:2025-10-29 09:30:33  IST  )

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అధికారులతో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించేందుకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా మొంథా తుపాను (cyclone) బీభత్సం సృష్టించింది. నిన్న రాత్రి ఈ తుపాను తీరం దాటినప్పటికి ఏపీలోని అనేక జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాను హెచ్చరికాలు జారీ అయినప్పటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నుంచి గ్రామిణ స్థాయిలో సర్పంచ్ వరకు కలెక్టర్ నుంచి పంచాయితి కార్యదర్శి వరకు మంత్రులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పడు జాగ్రత్తు పాటించారు. దీంతో ఈ పెను తుపాను నుంచి రాష్ట్రాన్ని పెద్ద నష్టం లేకుండా కపాడ గలిగారు. అయినప్పటికి భారీ ఈదురుగాలు, కుండ పోత వర్షాల కారనంగా లక్షల ఎరాల్లో పంటలు, తోటలకు నష్టం వాటిల్లింది. ప్రస్తుతం అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.

అయినప్పటికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu.).. అధికారులతో కలిసి ఏరియల్ సర్వే (Aerial Survey) నిర్వహించేందుకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరారు. హెలికాప్టర్ ద్వారా బాపట్ల, పల్నాడు, కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్ కొనసాగుతుంది. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు, నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు సీఎం చంద్రబాబు ఈ ఏరియల్ విజిట్ చేశారు. కోనసీమ జిల్లా, అల్లవరం మండలం ఓడలరేవులో సీఎం ల్యాండ్ అవనున్నారు. అనంతరం ఓడల రేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను అధికారులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు.

READ MORE .....

త్వరగా ప్రాథమిక అంచనాలు ఇవ్వండి: తుపాను నష్టంపై మంత్రి లోకేశ్ ఆదేశాలు

Next Story