- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అజిత్ పవార్ మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్న ప్రముఖులు.

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajith Pawar) మరణించారు. విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అజిత్ పవర్ ఆకస్మిక మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అజిత్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులందరికీ భగవంతుడు ధైర్యానివ్వాలని ప్రార్థించారు.
దేశానికి తీరని నష్టం : మంత్రి నారా లోకేశ్
బారామతి వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి విషాదకరమని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. అజిత్ ఆకస్మిక మృతి మహారాష్ట్రతో పాటు దేశానికి తీరని లోటుగా పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులతో పాటు ప్రియమైన వారికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. విషాదకరమైన ఈ సందర్భంగా వారి కుటుంబానికి ధైర్యాన్ని, శాంతిని చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు.
మహారాష్ట్ర ప్రజల సంక్షేమానికి అంకితం చేశారు
అజిత్ పవార్ తన జీవితాన్ని మహారాష్ట్ర ప్రజల సంక్షేమానికి అంకితం చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన సేవలను మహారాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరచిపోరని పేర్కొన్నారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి తనను షాక్ కు గురిచేసిందని పేర్కొన్నారు. పవార్ కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు, పార్టీ నేతలకు ఈ హృదయవిదారక సందర్భంలో ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. వారందరికీ ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఇకలేరనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇకలేరనే వార్త తెలిసి చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం చేశారన్నారు. మహారాష్ట్రలోని కూటమి ప్రభుత్వం రాజకీయ దురంధరుడిని కోల్పోయిందన్నారు. అజిత్ పవార్, అధికారులు, పైలట్ల మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులు, ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తీవ్రంగా కలిచివేసింది
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా ప్రమాదం జరగడం అత్యంత బాధాకరమన్నారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులతో పాటు, ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని మంత్రి ప్రకటించారు.
మాధవ్ తీవ్ర దిగ్బ్రాంతి
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ ఆకస్మిక మృతి పట్ల ఏపీ బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారి ఆత్మలకు శాశ్వత శాంతి చేకూరాలని, సద్గతులు ప్రాప్తించాలని కోరుకున్నారు.
అత్యంత హృదయవిదారకం
మహారాష్ట్రలోని బారామతి వద్ద ల్యాండింగ్ సమయంలో జరిగిన ప్రైవేట్ విమాన ప్రమాదం అత్యంత హృదయవిదారకమైనది. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా విమానంలో ఉన్న సిబ్బంది అందరూ ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు తెలియడం బాధాకరం అని బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎన్.విష్ణువర్ధన్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమికి చెందిన నేత మరణం మహారాష్ట్ర రాజకీయాలకు మాత్రమే కాకుండా దేశ రాజకీయాలకు తీరని లోటుగా పేర్కొన్నారు. ఈ ఘోర ప్రమాదంలో మృతి చెందిన వారందరి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ఈ క్లిష్ట సమయంలో దేవుడు ధైర్యం, బలం ప్రసాదించాలని ఆకాంక్షించారు.






