CM Chandrababu: వనజీవి రామయ్య మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం

by Prasad Jukanti |   (  Updated:2025-04-12 10:12:17  IST  )

వనజీవి రామయ్య మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.

CM Chandrababu: వనజీవి రామయ్య మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య (vanajivi ramaiah) మృతిపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సంతాపం తెలిపారు. రామయ్య మృతి వార్త తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యానన్నారు. ఒక వ్యక్తిగా ఉండి పర్యావరణ పరిరక్షణకు కోట మొక్కలు నాటిన రామయ్య కృషి స్ఫూర్తిదాయకం అని ఆయన సేవలను కొనియాడారు. నేటి తరానికి రామయ్య ఆదర్శప్రాయుడని ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటు అన్నారు. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామయ్య ఆత్మకు శాంతి కలగాని భగవంతుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు.

READ MORE ...

ఎక్కడికి పారిపోలేదన్నావ్.. మరి కనిపించవే: కాకాణిపై సోమిరెడ్డి సెటైర్స్


Next Story