- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా డీఎస్సీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సీఎం చంద్రబాబు అనకాపల్లిలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ యజ్ఞంలా పాలన చేస్తుంటే

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు అనకాపల్లిలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ యజ్ఞంలా పాలన చేస్తుంటే మరోవైపు భూ బకాసురులు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. భూ బకాసురులు ఎంతమంది వచ్చినా అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతామని అన్నారు. ఐటీ కంపెనీలు వస్తే కేసులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే దానిపై కూడా 40, 50కేసులు వేశారని మండిపడ్డారు. ఒకపక్క పనిచేస్తూనే మరోపక్క ఆ కేసులపై పోరాడాలని అన్నారు.
కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా కేసులు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కోసం మెడికల్ కాలేజీలను ఇచ్చామని చెప్పారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వలేదని మేనేజ్మెంట్ కు ఇచ్చామని అన్నారు. దానివల్ల సీట్లు పెరుగుతాయన్నారు. ఆస్పత్రుల్లో పేషెంట్లు అందరికి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగానే వైద్యం అందిస్తామని అన్నారు. కావాలనే ప్రైవేటుకు ఇచ్చామని మాట్లాడుతున్నారన్నారు. మొన్నటి వరకు 104,108 సేవలు ఏ విధంగా ఇచ్చారని ప్రశ్నించారు. ప్రతిఒక్కరూ యోగా చేయాలని ప్రపంచంలోని 150 దేశాలు యోగా చేస్తున్నాయన్నారు. విశాఖలో ప్రపంచం మెచ్చే విధంగా ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరిపించామన్నారు.






