పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు.. మహిళ కుటుంబానికి భరోసా!

by Jakkula.Mamatha |

ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇవాళ(శనివారం) చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.

పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు.. మహిళ కుటుంబానికి భరోసా!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇవాళ(శనివారం) చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరులో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్‏ను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఓ మహిళకు పింఛన్(AP Pensions) అందజేస్తుండగా ఆమె తన కష్టాలను చెప్పుకుంది. దీంతో మహిళ కుటుంబానికి సీఎం చంద్రబాబు ఆర్థిక భరోసా ఇచ్చారు. మహిళ కుటుంబానికి ఇల్లు మంజూరు చేయడంతో పాటు కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లలకు రూ.2 లక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని అధికారులను ఆదేశించారు.

దీంతో పాటు వారు సంక్షేమ పాఠశాలలో చదివేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ మహిళ సీఎం చంద్రబాబుకు నమస్కారించి ధన్యవాదాలు తెలిపింది. మరోవైపు సీఎం చంద్రబాబు(CM Chandrababu)తో ఫొటోలు దిగేందుకు స్థానికులు ఎగబడ్డారు. అయితే సీఎం చంద్రబాబు 10 సూత్రాల అంశంపై ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‏ను పరిశీలించనున్నారు. రామానాయుడుపల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొననున్నారు. గ్రామస్థులతో ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు.

Next Story