- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులందరికీ న్యాయం చేస్తాం: వినతులపై స్వయంగా సీఎం హామీ
by Vemula.Srinu Prasad |
సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఆ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు ఆయనను స్వయంగా కలిసి తమ సమస్యలను వివరించారు

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) శుక్రవారం మంగళగిరి(Mangalagiri)లోని తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఆ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు ఆయనను స్వయంగా కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన చంద్రబాబు.. వారి బాధలను ఓపికగా విని సానుకూలంగా స్పందించారు.
ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తాం..
ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సామాజిక, వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు.. వాటి పరిష్కారానికి తక్షణమే కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
Next Story






