Sea Plane Trip: సీ ప్లేన్ లో శ్రీశైలంకు చేరుకున్న సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |   (  Updated:2024-11-09 08:22:51  IST  )

విజయవాడ పున్నమి ఘాట్ (Punnami Ghat) వద్ద సీఎం చంద్రబాబు నాయుడు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, అధికారులతో కలిసి సీ ప్లేన్ (Sea Plane)ను ప్రారంభించారు.

Sea Plane Trip: సీ ప్లేన్ లో శ్రీశైలంకు చేరుకున్న సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ పున్నమి ఘాట్ (Punnami Ghat) వద్ద సీఎం చంద్రబాబు నాయుడు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, అధికారులతో కలిసి సీ ప్లేన్ (Sea Plane)ను ప్రారంభించారు. అనంతరం వారంతా సీ ప్లేన్ లో శ్రీశైలంకు బయల్దేరారు. సరిగ్గా 30 నిమిషాల్లోనే చంద్రబాబు నాయుడి బృందం శ్రీశైలంకు చేరుకున్నారు. అక్కడ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల అనంతరం తిరిగి విజయవాడకు రానున్నారు. కాగా.. ఏపీలో సీ ప్లేన్ సేవలు వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇది కేవలం ట్రయల్ మాత్రమేనని, భవిష్యత్ లో ఎయిర్ పోర్టులకు ప్రత్యామ్నాయంగా సీ ప్లేన్లను అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై యోచన చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

Next Story