AP:విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్!

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో ఏటా డిసెంబర్ 7న పేరెంట్, టీచర్స్ సమావేశం నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రకటించారు. ఇది చరిత్రను తిరగరాసే ఆలోచన అని చెప్పారు.

AP:విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఏటా డిసెంబర్ 7న పేరెంట్, టీచర్స్ సమావేశం నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రకటించారు. ఇది చరిత్రను తిరగరాసే ఆలోచన అని చెప్పారు. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్‌(Minister Lokesh)తో కలిసి బాపట్లలో స్కూల్ విద్యార్థులతో(School Students) భోజనం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. వారి పరీక్ష ఫలితాలను పరిశీలించారు. వారి విద్యాభ్యాసం సామర్థ్యాలను పరీక్షించారు. పిల్లల జీవిత లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు.

వారికి పలు సూచనలు చేశారు. తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థుల సూచనలు, సలహాలు ఆయన విన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. బాపట్లలో విద్యార్థుల క్రీడా పోటీలను చంద్రబాబు ప్రారంభించారు. సరదాగా కాసేపు వారితో కలిసి టగ్‌ ఆఫ్‌ వార్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో పిల్లలకు చెడు వ్యసనాల బారిన పడకుండా పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఈగల్ వ్యవస్థ(Eagle system) ద్వారా గంజాయి వినియోగాన్ని పూర్తిగా నివారిస్తామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) పేర్కొన్నారు.

Next Story