- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Narayana:రేపు సరికొత్త థీమ్‌తో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్
ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్ది.. దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంగా పెట్టుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్ది.. దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రతినెలా మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒక్కో నెల ఒక్కో థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు(శనివారం) స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహణకు సంబంధించి మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫనరెన్స్‌కి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, స్వచ్ఛ ఆంధ్ర ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, అన్ని మున్సిపాలిటీ కమిషనర్లు హాజరయ్యారు.
మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి నెల మూడో శనివారం క్రమం తప్పకుండా ఒక్కొక్క థీమ్ తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేపు ఇ - చెక్ అనే థీమ్‌తో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. షాపులు, ఇళ్లలో ఉన్న ఎలక్ట్రానిక్ వేస్ట్ ను పూర్తిగా సేకరించాలి. మున్సిపాలిటీల్లో ఉన్న RRR సెంటర్లను ఈ కలెక్షన్ సెంటర్లుగా మార్చి మెప్మా మహిళలకు అప్పగించాలి. ప్రతి మున్సిపాలిటీ కమిషనర్ ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలి. దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ముందుకు వెళ్లాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలతో కలిసి అన్ని ప్రాంతాలలోనూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.






