- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కల్యాణ్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య గొడవ.. ఒకరు మృతి
పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సినిమా హీరోల అభిమానుల మధ్య జరిగిన స్వల్ప వివాదం ఒకరి ప్రాణాలను బలిగొంది.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సినిమా హీరోల అభిమానుల మధ్య జరిగిన స్వల్ప వివాదం ఒకరి ప్రాణాలను బలిగొంది. శనివారం రాత్రి హీరోలపై అభిమానంతో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ జరిగింది. ప్రభాస్ ఫ్యాన్ హరికుమార్, పవన్ కల్యాణ్ కిషోర్ మధ్య వాట్సాప్ స్టేటస్ విషయంలో స్వల్ప వివాదం తలెత్తింది. అదికాస్త ముదిరి భారీ ఘర్షణ చోటుచేసుకొని, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి ఆగ్రహంతో ఊగిపోయిన ప్రభాస్ ఫ్యాన్ హరికుమార్.. పవన్ కల్యాణ్ అభిమాని అయిన కిషోర్‌ను కొట్టి చంపాడు. భవనానికి రంగులు వేసేందుకు వచ్చిన హరికుమార్, కిషోర్ మాటల మధ్య గొడవ పడినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.






