- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గడువులోగా పూర్తి చేయాలి.. వార్డు పనులపై గుంటూరు కమిషనర్ ఆదేశం
వార్డుల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, పనుల వేగవంతంకు ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సూచించారు..

దిశ, ప్రతినిధి, గుంటూరు: వార్డుల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, పనుల వేగవంతంకు ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సూచించారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ఏఈల వారీగా ప్రతి వార్డ్ పరిధిలో జరుగుతున్న పెండింగ్‌లో ఉన్నఅభివృద్ధి పనులను అడిగి తెలుసుకొని మాట్లాడుతూ అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. రోడ్ల విస్తరణ, డ్రైన్ల నిర్మాణ సం సమయాల్లో పట్టణ ప్రణాళిక అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో సర్వేయర్ ద్వారా మార్కింగ్ చేయాలన్నారు. విద్యుత్ స్తంభాల షిఫ్ట్‌కి సంబంధించి పెండింగ్ అంశాలను సదరు శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడాలని ఎస్ఈని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓఫ్బులేసు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, సిటి ప్లానర్ రాంబాబు, డిసిపీ సూరజ్, ఈఈలు సుందర్రామిరెడ్డి, వేణు, విష్ణు, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు పాల్గొన్నారు.






