పరకామణి కేసు.. సీఐడీ విచారణ షురూ

by Vemula.Srinu Prasad |

పరకామణి కేసులో సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు..

పరకామణి కేసు.. సీఐడీ విచారణ షురూ
X

దిశ, వెబ్ డెస్క్: పరకామణి కేసు(Parakamany) రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై సీఐడీ విచారణ ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాలతో సీఐడీ ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్(CID ADG Ravi Shankar Ayyannar) నేతృత్వంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Former TTD Chairman Bhumana Karunakar Reddy), అప్పటి టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీశ్ కుమార్‌(TTD Assistant Vigilance Security Officer Satish Kumar)ను విచారించనున్నారు. ఈ కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరో సీఐడీ అధికారులు తేల్చనున్నారు.

ఈ మేరకు 20 మంది సభ్యులతో ఐదు బృందాలు కేసును దర్యాప్తు చేస్తున్నాయి. మరో పది మంది టెక్నికల్ సిబ్బంది సైతం దర్యాప్తులో పాల్గొంటున్నారు. పరకామణి చోరీ కేసుతో పాటు ఇతర అంశాలపైనా విచారన ప్రారంభించారు. ఇప్పటికే కీలక నిందితుడు రవికుమార్‌ను విచారిస్తున్నారు. మరికొందరికి నోటీసులు అందజేశారు. 1985లో మరంలో చేరిన రోజు నుంచి రవికుమార్ వ్యవహార శైలి, సహకరించిన అధికారుల పాత్రపైనా విచారణ కొనసాగుతోంది. తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీశ్ కుమార్‌ను సైతం విచారించనున్నారు.

Next Story