పరకామణి చోరీ కేసు.. ఆస్తుల వివరాలను మెయిల్ చేయాలని సీఐడీ డీజీ విజ్ఞప్తి

by Naga Rani Yarlagadda |

తిరుమల పరకామణి చోరీ కేసులో డిసెంబర్ 2వ తేదీలోగా సీఐడీ హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంది.

పరకామణి చోరీ కేసు.. ఆస్తుల వివరాలను మెయిల్ చేయాలని సీఐడీ డీజీ విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల పరకామణి చోరీ కేసులో డిసెంబర్ 2వ తేదీలోగా సీఐడీ హైకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ క్రమంలో సీఐడీ డీజీ రవిశంకర్ బుధవారం తిరుపతిలో కీలక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పరకామణి కేసు విచారణ, వివరాలను వెల్లడించారు. పరకామణి ఆస్తుల వివరాలు ఉంటే తెలపాలని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. పరకామణి ఆస్తుల గురించి తెలిసిన వారు ఆ వివరాలను 9440700921 నంబర్ కు లేదా [email protected]కు మెయిల్ చేయాలని కోరారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తుకు టీటీడీ సహకరిస్తోందన్నారు.

Next Story