Tirumala Temple:1938లో తిరుమల ఆలయం ఎలా ఉండేదంటే..!? (ఫొటోలు వైరల్)

by Jakkula Mamatha |
Tirumala Temple:1938లో తిరుమల ఆలయం ఎలా ఉండేదంటే..!? (ఫొటోలు వైరల్)
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచ ప్రసిద్ది చెందిన ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై..మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల ఆలయంలో విష్ణుమూర్తి స్వరూపమైన వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయం ఇండియాలో అత్యంత రెండవ ధనిక దేవాలయం గా చెబుతారు. కలియుగ కష్టాల నుంచి సమస్త మానవాళిని రక్షించేందుకు ఆ వేంకటేశ్వరుడు భూలోకానికి వచ్చారని భక్తులు విశ్వసిస్తారు. తిరుమల ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ ఆలయానికి సెలవులు, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే శేషాచలం కొండల పై ఉన్న వేంకటేశ్వరుని దర్శనం కోసం ప్రస్తుతం రోడ్డు, నడక మార్గాల ద్వారా వెళ్లవచ్చు. కానీ 1938లో ఆలయానికి చేరుకునేందుకు కొండ మార్గం ఎలా ఉండేది, పాత ఆలయం ఎలా ఉంటుందో చూపే ఫొటోలు ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి. రోడ్డు సరిగా లేకపోవడంతో నడవలేని భక్తులను డోలీ ద్వారా కొండెక్కించేవాళ్లు అని చెబుతున్నారు. అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed