తిరుమల భక్తులకు అలర్ట్.. పౌర్ణమి గరుడసేవ రద్దు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-02 14:48:07  IST  )

తిరుమలలో శనివారం నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడ సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది...

తిరుమల భక్తులకు అలర్ట్.. పౌర్ణమి గరుడసేవ రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)కు టీటీడీ(TTD) కీలక ప్రకటన చేసింది. శనివారం జరగాల్సిన పౌర్ణమి గరుడసేవ(Pornami Garuda Seva)ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్నామని, ఈ నెల 3న శ్రీ‌వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయని, ఈ కార‌ణంగా పౌర్ణమి గరుడసేవ రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. గరుడసేవల్లో పాల్గొనాలనుకున్న భక్తులు ఈ ప్రటకన మేరకు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. శ్రీవారి సర్వదర్శనాలు ఈ నెల 8వరకు కొనసాగతాయని సూచించారు. టికెట్ లేకపోయినా వెంకన్న సేవలో పాల్గొనవచ్చని అధికారులు పేర్కొన్నారు.

Next Story