తిరుపతి చిట్వేల్‌లో విషాదం.. నదిలో పడి ఇద్దరు మృతి

by Vemula.Srinu Prasad |

తిరుపతి చిట్వేల్‌లో విషాదం చోటు చేసుకుంది...

తిరుపతి చిట్వేల్‌లో విషాదం.. నదిలో పడి ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి చిట్వేల్‌(Tirupati Chitvel)లో విషాదం(Tragedy) చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గుంజున నది(Gunjuna River)లో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. తిరుపతి(Tirupati) నుంచి వస్తాన్ వలి దర్గా(Mastan Vali) సందర్శనకు యువకులు వచ్చారు. ఈ నేపథ్యంలో గుంజున నది వద్దకు వెళ్లారు. స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. అయితే ప్రమాదవశాత్తు ఇద్దరూ కూడా నీటిలో మునిగిపోయారు. ఈత రాకపోవడంతో కొద్ది సేపటికే ఊపిరాడక మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. ఈతగాళ్ల సాయంతో యువకుల మృతదేహాలను వెలికితీశారు. యువకుల వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story