- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో పుష్పయాగానికి రేపే అంకురార్పణం
తిరుమలలో ప్రతి సంవత్సరం పుష్పయాగం (Pushpa Yagam) నిర్వహిస్తారు. ఈ ఏడాది నిర్వహించనున్న పుష్పయాగానికి రేపు (October 29) అంకురార్పణం చేయనున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో ప్రతి సంవత్సరం పుష్పయాగం (Pushpa Yagam) నిర్వహిస్తారు. ఈ ఏడాది నిర్వహించనున్న పుష్పయాగానికి రేపు (October 29) అంకురార్పణం చేయనున్నారు. అక్టోబరు 30న పుష్పయాగం జరగనుంది. అంకురార్పణం వసంత మండపంలో జరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. అంకురార్పణంలో భాగంగా మృత్సంగ్రహణం, ఆస్థానం వంటి ధార్మిక కార్యక్రమాలు బుధవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య నిర్వహిస్తారన్నారు. అక్టోబర్ 30న పుష్పయాగం ప్రధాన వేడుకలు జరుగుతాయన్నారు. ఉదయం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 1 నుండి 5 గంటల వరకు పుష్పయాగం జరుగుతుందని వెల్లడించారు.
అంకురార్పణం అనేది ఏదైనా ఉత్సవం విజయవంతంగా పూర్తవ్వాలని కోరుతూ చేసే ఒక వైదిక ప్రక్రియ. పుష్పయాగం అంటే వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని ఆరాధించడం. ఈ వార్షిక ఉత్సవాల వల్ల భక్తులకు ప్రత్యేక అనుభూతి లభిస్తుంది. ఈ ఉత్సవాల సమయంలో కొన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తారని సమాచారం.






