- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirupati | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో (Tirumala) భక్తలు రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో (Tirumala) భక్తలు రద్దీ కొనసాగుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. తలనీలాలు ఇచ్చి మొక్కులను చెల్లించుకుంటున్నారు. నిన్న స్వామివారిని 73,677 మంది దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 24,732 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించినట్లు పేర్కొన్నారు. హుండీ ఆదాయం రూ.3.26 కోట్లు వచ్చాయని వెల్లడించారు. స్వామివారి దర్శనం కోసం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని.. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 12 గంటల సమయం పడుతోందని తెలిపారు.
మల్లన్నకు రికార్డు స్థాయిలో ఆదాయం
శ్రీశైలం మల్లన్నకు కార్తీకమాసంలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. 33 రోజులకు గానూ రూ.7 కోట్ల 27 లక్షల 26 వేల 400 నగదు, 117 గ్రాముల బంగారం, 7 కేజీల వెండి, విదేశీ కరెన్సీ వచ్చినట్లు ఆలయాధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కోటి 30 లక్షలు అధికంగా మల్లన్న హుండీ ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. కార్తీకమాసంలో హుండీ ఆదాయం ఈ స్థాయిలో రావడం మొదటిసారి కావడం విశేషంగా తెలిపారు.






