- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kapu leaders warn RGV: రాష్ట్రంలో అడుగుపెడితే నాలుక కోస్తాం
దర్శకుడు రాంగోపాల్ వర్మపై కాపు లీడర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై కాపులను ఉద్దేశించి దర్శకుడు రామ్ గోపాల్ వివాదాస్పద ట్వీట్ చేశారు....

X
దిశ, డైనమిక్ బ్యూరో : దర్శకుడు రాంగోపాల్ వర్మపై కాపు లీడర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీపై కాపులను ఉద్దేశించి దర్శకుడు రామ్ గోపాల్ వివాదాస్పద ట్వీట్ చేశారు. దీంతో కాపుల లీడర్స్ మండిపడుతున్నారు. తాజాగా రాంగోపాల్ వర్మకు కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో అడుగుపెడితే నాలుక కోస్తామంటూ హెచ్చరించారు. వైఎస్ జగన్ వద్ద ఎంత డబ్బులు తీసుకుని ట్వీట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాధికారం కోసం కాపులు పోరాటం చేస్తున్న తరుణంలో అమ్ముడు పోతున్నారని విమర్శించడం దుర్మార్గమన్నారు. ప్రచారం కోసం పని పాట లేని వర్మ.. పవన్, చంద్రబాబులపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.
Next Story






