- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirupati: ఫొటో స్టిల్స్ కోసం ప్రాణాలు పొగొట్టుకున్న యువకుడు
ఫొటో స్టిల్స్ కోసం ఓ యువకుడు ప్రాణాలు పొగొట్టుకున్నారు....

దిశ, వెబ్ డెస్క్: ఫొటో స్టిల్స్ కోసం ఓ యువకుడు ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లా తనకోనలో జరిగింది. కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన సుమంత్ స్నేహితులతో కలిసి తలకోన వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లారు. ఫొటో స్టిల్స్ చేస్తూ మడుగులోకి దూకాడు. అయితే మడుగులోని రాళ్ల మధ్య ఇరుక్కు పోయాడు. ఎంతకీ బయటకు రాలేదు. నీళ్లలో ఊపిరాడక చనిపోయారు. స్నేహితులు చూస్తుండగానే సుమంత్ ప్రాణం పోయింది. దీంతో సుమంత్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇక విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో సుమంత్ మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం సుమంత్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫొటో స్టిల్స్ కోసం ఎవరూ కూడా ఫీట్లు చేయవద్దని.. అలా చేసి కుటుంబాల్లో విషాద ఛాయలు నింపొద్దని పోలీసులు సూచించారు. వాటర్ ఫాల్స్ లో స్నానం చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అలాగే వాటర్ ఫాల్స్ వద్ద సెల్ఫీలు దిగే ప్రయత్న కూడా చేయొద్దని పోలీసులు తెలిపారు.






