- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతి | చిల్లకూరు హైవేపై బస్సు బోల్తా
చిల్లకూరు (Chillakuru) జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి (Bus Accident) గురైంది.

దిశ, వెబ్ డెస్క్ : చిల్లకూరు (Chillakuru) జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి (Bus Accident) గురైంది. అయితే ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం కొందరు భక్తులు గుంటూరు నుంచి శబరిమల వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించుకున్నారు. అందులో భాగంగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సును బుక్ చేసుకున్నారు. అదే బస్సులో గుంటూరు నుంచి శబరిమలకు బయలుదేరారు. గుంటూరు నుంచి ప్రయాణమైన బస్సు శబరిమలకు బయలుదేరింది. ఈ క్రమంలో హైవేపై ప్రయాణిస్తుండగా చిల్లకూరు వద్ద ఒక్కసారిగా బస్సు డ్రైవర్ చేతి నుంచి అదుపు తప్పింది. రైటర్ సత్రం వద్ద బస్సు బోల్తా కొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ఆకస్మిక ప్రమాద ఘటనతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. భయాందోళనలకు లోనై సహాయం కోసం పిలిచారు. అటుగా వెళ్తున్న పలువురు వెంటనే వారికి సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. స్థానికుల సహకారంతో ప్రమాదంలో గాయపడిన వారికి బస్సు నుంచి బయటకు తీశారు. విషయం తెలుసుకున్న చిల్లకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద కారణాలపై విచారించారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే బస్సు శౌర్యన్ ట్రావెల్స్ కు చెందిందిగా పోలీసులు గుర్తించారు. 35 మంది అయ్యప్ప భక్తులు ఆ బస్సులో ప్రయాణిస్తున్నారని సమాచారం.






