4న స్వామివారి కల్యాణోత్సవం.. భక్తుల వస్త్రధారణపై టీటీడీ కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

తిరుపతి కోదండరామస్వామి కల్యాణోత్సవంలో పాల్గొనే భక్తుల వస్త్రధారణపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది...

4న స్వామివారి కల్యాణోత్సవం.. భక్తుల వస్త్రధారణపై టీటీడీ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి కోదండరామస్వామి ఆలయం(Tirupati Kodandarama Swamy Temple)లో పౌర్ణమి సందర్భంగా శనివారం అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. ఆలయంలో ఉదయం 9 గంటలకు శతకలశాభిషేకం నిర్వహిస్తారని తెలిపారు. భక్తులు ఒక్కొక్కరు రూ.50/- చెల్లించి ఈ సేవలో పాల్గొనచ్చని చెప్పారు. అలాగే సాయంత్రం 5.30 గంటలకు సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారన్నారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

జనవరి 4న కల్యాణోత్సవం

కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఉదయం 11 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారని స్పష్టం చేశారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500 చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారని వెల్లడించారు. అనంతరం సాయంత్రం 5.30 గంటలకు సీత లక్ష్మణ సమేత కోదండరామస్వామి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారని, అక్కడి నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌ సేవ చేపడతారని స్పష్టం చేశారు. కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులు సంప్రదాయ వస్త్రధారణలో రావాలని టీటీడీ అధికారులు పిలుపునిచ్చారు.

Next Story