Tirumala: శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం

by Disha Web Desk 16 |
Tirumala: శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం
X

దిశ, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30న గురువారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ఆస్థానం జరగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీరాముల‌వారు హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. మార్చి 31న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా గురువారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు హ‌నుమంత వాహ‌నసేవ జ‌రుగుతుంది. ఆ త‌రువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ కార‌ణంగా స‌హ‌స్రదీపాలంకార సేవ‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

మార్చి 31న శుక్రవారం సాయంత్రం 5 గంట‌ల‌కు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స‌హ‌స్రదీపాలంకార సేవ జ‌రుగుతుంది. రాత్రి 8 నుండి 9 గంటల న‌డుమ బంగారు వాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు.

Next Story

Most Viewed