Tirumala : శ్రీవారికి విరాళంగా వెండి గంగాళం

by Thanuru Gopichand |

తిరుమల వెంకటేశ్వర స్వామి వైభవం ఎంత చెప్పుకున్నా తక్కువే.

Tirumala : శ్రీవారికి విరాళంగా వెండి గంగాళం
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల వెంకటేశ్వర స్వామి వైభవం ఎంత చెప్పుకున్నా తక్కువే. అన్నమయ్య కీర్తనల్లో స్వామివారి అద్భుత మూర్తి కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. ఎంతో ఆర్తితో అన్నమయ్య ఆ స్వామి వారిని, స్వామి వెలిసి తిరుమల కొండను కీర్తిస్తూ, వర్ణిస్తూ కీర్తనలను రచించారు. అందరూ అంతటి భక్తి ప్రపత్తులను కనబరచలేకపోయినా.. ఉడతా భక్తిగా తమ వంతు కానుకలను తిరుమల శ్రీవారికి సమర్పిస్తుంటారు. కానుకలను (Gifts) అందజేసి ఆ వడ్డీ కాసులవాడిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తారు. తల నీలాలిస్తే సంతోషపడే ఆ స్వామికి కొందరు నిలువు దోపిడీలిస్తే.. మరికొందరు బంగారు, వెండి కానుకలు, వజ్ర వైఢూర్యలను సమర్పించి మొక్కును చెల్లించుకుంటారు.

అలాంటి విలువైన కానుకనే హైదరాబాద్ కు చెందిన జక్కా రెడ్డి శ్రీనివాసులు రెడ్డి (Jakka Reddy Srinivasulu Reddy) అనే భక్తులు శ్రీవారికి సమర్పించాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తమతో పాటు తెచ్చి 22కేజీల వెండి గంగాళాన్ని (Silver Vessel) విరాళంగా అందజేశారు. గంగాళాన్ని టీటీడీ అధికారులకు స్వామి వారి కానుకగా సమర్పించి తన మొక్కును తీర్చుకున్నారు. అనంతరం అధికారులు శ్రీనివాసులు రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలను అందజేశారు. మార్కెట్లో ఈ వెండి గంగాళం సుమారు రూ.30లక్షలు విలువ చేస్తుంది.

Next Story