స్వర్ణరథంపై సిరుల తల్లి.. కనులవిందుగా తిరుచానూరు వసంతోత్సవాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-01 15:02:18  IST  )

తిరుచానూరు పద్మావతి అమ్మ ఆలయంలో వసంతోత్సవాలు వైభంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు శుక్రవారం స్వర్ణరథోత్సవం భక్తి వైభవంతో అద్భుతంగా జరిగింది...

స్వర్ణరథంపై సిరుల తల్లి.. కనులవిందుగా తిరుచానూరు వసంతోత్సవాలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుచానూరు పద్మావతి అమ్మ ఆలయం(Tiruchanur Padmavati Amma Temple)లో వసంతోత్సవాలు వైభంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు శుక్రవారం స్వర్ణరథోత్సవం(Golden Chariot Festival) భక్తి వైభవంతో అద్భుతంగా జరిగింది. సిరుల తల్లి పద్మావతి అమ్మ స్వర్ణరథంపై ఆశీనురాలై భక్తులకు దివ్య కటాక్షం ప్రసాదించారు. ఆలయంలో వైదిక కార్యక్రమాల అనంతరం అర్చకులు అమ్మవారి ఉత్సవమూర్తిని శాస్త్రోక్తంగా స్వర్ణరథంపై ప్రతిష్ఠించారు. అనంతరం నాలుగు మాడ వీధుల్లో స్వర్ణరథం సంచరించగా భక్తుల గోవింద నామస్మరణలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ప్రత్యేకంగా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని అపార భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగడం విశేష ఆకర్షణగా నిలిచింది. కర్పూర హారతులు సమర్పిస్తూ అమ్మవారి దివ్య దర్శనంతో భక్తులు ఆధ్యాత్మికానందంలో మునిగిపోయారు.

Read More.. గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు? పరమార్థమేంటి? లోకల్ టెంపుల్స్‌లో ఎందుకీ ట్రెండ్?

Next Story