- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: అంత్యక్రియల్లో తీవ్ర విషాదం.. పాడె మోస్తూ ముగ్గురు మృతి
చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబగానిపల్లెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబగానిపల్లెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చనిపోయిన మహిళ అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తుండగా పాడెకు విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. తంబగానిపల్లె చెందిన రాణి అనారోగ్యంతో మృతి చెందారు. అయితే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. రాణి మృతదేహాన్ని శ్మశానికి తీసుకెళ్లే సమయంలో కరెంట్ స్తంభం నుంచి వేలాడుతున్న విద్యుత్ తీగలు పాడెకు తగిలాయి. దీంతో మృతదేహాన్ని మోస్తున్న ముగ్గురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తిరుపతి, రవీంద్రన్, మునప్పగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Next Story






