PM Modi Mann Ki Baat: సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-02-26 12:55:23  IST  )

ప్రజల్లో మనకీ బాత్ కార్యక్రమం ఎంతో ప్రేరణ కలిగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు....

PM Modi Mann Ki Baat: సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తిరుపతి: ప్రజల్లో మనకీ బాత్ కార్యక్రమం ఎంతో ప్రేరణ కలిగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తిరుపతిలో మోదీ మన్‌కీ బాత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినెల చివరి ఆదివారం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమం 98వ భాగం నేడు పూర్తయిందని చెప్పారు. వచ్చే ఏప్రిల్‌లో జరిగే 100వ భాగంతో ఈ కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. ప్రపంచంలో ఏ దేశాధినేత ఇలా ప్రజలతో మాట్లాడలేదని పేర్కొన్నారు. ప్రజలకు ఎంతో ప్రేరణ నిచ్చే కార్యక్రమం మన్ కీ బాత్ అని తెలిపారు. దేశంలో జరిగే ఎన్నో సంఘటనల్ని విజువల్స్ రూపంలో చూపిస్తూ దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిన కార్యక్రమని చెప్పారు. ఏప్రిల్‌లో జరిగే 100వ భాగాన్ని దేశంలోని ప్రతి వాడలో, ప్రతి బస్తీలో ప్రజలందరు చూడాలని సోమువీర్రాజు పిలుపునిచ్చారు.

Next Story