దాహంతో ఇంట్లో దూరిన తాచుపాము.. నీళ్లు తాగించి.. ఆ తర్వాత!

by Ramesh Naini |   (  Updated:2026-04-07 14:16:29  IST  )

వేసవి ఎండల తీవ్రతకు దాహంతో అలమటిస్తూ ఓ ఇంట్లోకి దూరిన నాగుపాముకు స్నేక్ క్యాచర్ నీళ్లు తాగించి మానవత్వం చాటుకున్నాడు.

దాహంతో ఇంట్లో దూరిన తాచుపాము.. నీళ్లు తాగించి.. ఆ తర్వాత!
X

దిశ, డైనమిక్ బ్యూరో: వేసవి ఎండల తీవ్రతకు దాహంతో అలమటిస్తూ ఓ ఇంట్లోకి దూరిన నాగుపాముకు స్నేక్ క్యాచర్ నీళ్లు తాగించి మానవత్వం చాటుకున్నాడు. తిరుపతి జిల్లా పుత్తూరులో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పుత్తూరులోని ఓ ఇంట్లోకి చొరబడిన నాగుపాము నీటి ట్యాంక్ కింద దాక్కోవడంతో.. గమనించిన ఇంటి సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్‌ శ్రీకాంత్ వెంటనే అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా బంధించాడు.

అయితే, ఎండ తీవ్రతకు పాము తీవ్ర దాహంతో ఉన్నట్లు గుర్తించిన ఆయన.. దానికి స్వయంగా నీళ్లు తాగించాడు. అనంతరం ఆ నాగుపామును సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టాడు. ఎవరికీ ఎలాంటి అపాయం జరగకుండా సమస్య పరిష్కారం కావడంతో ఇంటి సభ్యులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story