చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఢీ.. పలువురికి గాయాలు

by Thanuru Gopichand |

చిత్తూరు జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి.

చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఢీ.. పలువురికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లాలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పుంగనూరు-పలమనేరు మధ్య ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరుపల్లి మలుపులో పలమనేరు నుంచి మదనపల్లె వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సుల ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. కొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే బాధితులకు సహాయం చేసేందుకు ప్రమాద ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే కర్నూలు బస్సు ప్రమాద ఘటన నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు జరగడం ప్రజల్లో మరింత ఆందోళనలు కలిగిస్తున్నాయి.

Next Story