Joint Chittoor: తిరుమల వెళ్తూ ఇద్దరు.. ఈత కొడుతూ మరో ఇద్దరు.. మొత్తం నలుగురు మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-04-10 11:28:52  IST  )

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్తిండ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

Joint Chittoor: తిరుమల వెళ్తూ ఇద్దరు.. ఈత కొడుతూ మరో ఇద్దరు.. మొత్తం నలుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్తిండ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు కర్ణాటక కోలార్ వాసులుగా గుర్తించారు.

మరోవైపు చిత్తూరు జిల్లా కుప్పంలో విషాదం నెలకొంది. నూలు కుంటలో ఈతకు వెళ్లిన ఇద్దరు మృతి చెందారు. మృతులు బెంగళూరు వాసులుగా గుర్తించారు. రెండు ఘటనల్లోనూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.

Next Story