- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుప్పంలో పిచ్చి కుక్క స్వైరవిహారం.. 25 మందిపై దాడి
కుప్పం మున్సిపల్ పరిధిలోని ప్యాలెస్ రోడ్డులో ఉన్న ఓం శక్తి ఆలయం సమీపంలో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: కుప్పం మున్సిపల్ పరిధి(Kuppam Municipal Limits)లోని ప్యాలెస్ రోడ్డులో ఉన్న ఓం శక్తి ఆలయం(Om Shakti Temple) సమీపంలో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఓ పిచ్చికుక్క(Mad Dog) ఒక్కసారిగా రెచ్చిపోయి రోడ్డుపై వెళ్తున్న పాదాచారులు, వాహనదారులపై విచక్షణారహితంగా దాడికి తెగబడింది. ఈ ఆకస్మిక దాడిలో సుమారు 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
విపరీతంగా వీధికుక్కల సంఖ్య
అయితే ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో రోజురోజుకూ వీధికుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని, ఒంటరిగా బయటకు రావాలంటేనే భయపడాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి, ఇలాంటి ప్రమాదకరమైన కుక్కల బెడద నుంచి తమకు విముక్తి కలిగించాలని, తగిన నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.






