- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రమశిక్షణ పేరుతో చిత్రహింసలు.. భగ్గుమన్న విద్యార్థి లోకం
తిరుపతిలో నాారాయణ జూనియర్ కాలేజీలో సెండియర్ చదువుతున్న విద్యార్థిపై లెక్చరర్ దాడి చేయడంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి...

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి నారాయణ విద్యాసంస్థల్లో(Tirupati Narayana Educational Institutions) దారుణం జరిగింది. రేణిగుంట రోడ్డులోని వెంకటాద్రి క్యాంపస్, ఎం.ఆర్. పల్లి బ్రాంచ్‌లలో క్రమశిక్షణ పేరుతో విద్యార్థుల(Students)ను లెక్చరర్(Lecturer) చిత్రహింసలకు గురి చేశారు. ఇంటర్ సెకండియర్(Inter Secondary) విద్యార్థులను దారుణంగా చితకబాదారు. ఈ దృశ్యాలు కాలేజీలోని సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. ఈ వీడియో బయటకు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా మండిపడ్డారు. నారాయణ కాలేజీ యాజమాన్యం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై భౌతిక దాడులకు పాల్పడుతున్న వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు కనీస రక్షణ లేకుండా శారీరక హింసకు గురిచేస్తున్నారన్నారు. బాధ్యులైన అధ్యాపకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చదువును వ్యాపారంగా మార్చి, భారీగా ఫీజులు దోచుకుంటున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి.






