Breaking: శ్రీకాళహస్తి ఆలయం ప్రసాదంలో చేతివాటం.. అధికారి సురేశ్ రెడ్డి సస్పెన్షన్

by Vemula.Srinu Prasad |

చేతివాటంపై వేటు పడిన ఘటన శ్రీకాళహస్తి ఆలయంలో జరిగింది....

Breaking: శ్రీకాళహస్తి ఆలయం ప్రసాదంలో చేతివాటం.. అధికారి సురేశ్ రెడ్డి సస్పెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: చేతివాటంపై వేటు పడిన ఘటన శ్రీకాళహస్తి ఆలయంలో జరిగింది. ఆలయంలో భక్తులకు వితరణ చేసే పులిహోర ప్రసాద విక్రయాల్లో సిబ్బంది అవకతవకలకు పాల్పడ్డారు. నాణ్యతతో అందించాల్సిన పులి హోర ప్రసాదంలో అక్రమాలకు పాల్పడ్డారు. పులిహోర తయారీకి తక్కువ ఖర్చు చేసి ఎక్కువ చూపినట్లు తేలింది. ఈ విషయం ఈవో అకస్మాత్తుగా తనిఖీల్లో బయటపడింది. పులిహోర ప్రసాద విక్రయాల్లో తేడాలను గుర్తించి ఈవో సీరియస్ అయ్యారు. కారకులైన పోటు అధికారి సురేశ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాగా పరిపూర్ణమైన మనసుతో సేవ చేయాల్సిన అధికారులు చేతివాటానికి పాల్పడుతుండటంపై భక్తులు మండిపడుతున్నారు. ఆలయంలో అక్రమాలు జరగకుండా చూడాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Next Story