పరకామణి చోరీ కేసులో భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు

by Thanuru Gopichand |   (  Updated:2025-11-25 06:41:40  IST  )

పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి (Bhumana Karunakar Reddy) నోటీసులు జారీ అయ్యాయి.

పరకామణి చోరీ కేసులో భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి (Bhumana Karunakar Reddy) నోటీసులు జారీ అయ్యాయి. విచారణకు హాజరు కావాలని కరుణాకర్ రెడ్డిరి సీఐడీ అధికారులు నోటీసులను జారీ చేశారు. మాజీ ఏవీఎస్ఓ సతీష్ ఫిర్యాదు మేరకు తిరుమల ఒకటో పట్టణ పోలీసు స్టేషనులో పరాకమణి కేసు నమోదు అయ్యింది. సతీష్ కుమార్, రవికుమార్ రాజీపడి కేసును మూసివేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరాకమణి చోరీ కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టింది. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ (CID) సారథ్యంలో తిరుపతిలో పద్మావతి గెస్ట్ హౌజ్ లో విచారణ కొనసాగుతోంది. నేడు సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు హాజరు కావాలని సీఐడీ కరుణాకర్ రెడ్డిని ఆదేశించింది.

డిసెంబర్ 2న సీల్డ్ కవరులో నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో పరాకమణి చోరీకి సంబంధించిన విచారణను సీఐడి అధికారులు వేగవంతం చేశారు. గతంలో మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ కు విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులిచ్చింది. ఈ క్రమంలో ఆయన అనంతపురం జిల్లా తాడిపత్ర సమీపంలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో కాస్త మందగించిన విచారణను సీఐడీ అధికారులు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నాయకత్వంలో తిరుపతి పద్మావతి గెస్ట్ హౌజ్ లో గత మూడు రోజులుగా విచారణ కొనసాగుతోంది. నిన్న గతంలో వీజీఓగా పనిచేసిన ఉన్నతాధికారి గిరిధన్ ను పిలిపించి నిన్న విచారించారు. అందులో భాగంగానే పరాకమణి చోరీ సమయంలో పనిచేసిన పలువురు టీటీడీ అధికారులను కూడా విచారించారు. అదే సమయంలో కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మనుగా, తిరుపతి ఎమ్మెల్యేగా, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. అయితే పరాకమణి చోరీ కేసు రాజీలో కరుణాకర్ రెడ్డి పాత్ర ఏంటి అనే దానిపై విచారించనున్నారు. రవి కుమార్ కు సంబంధించిన 14 కోట్ల రూపాయల ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇవ్వడం ద్వారా కేసును రాజీకి కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది కాబట్టి.. ఆ సమయంలో టీటీడీ చైర్మనుగా, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఆయన పాత్ర ఏంటనే కోణంలో విచారణ సాగనున్నట్లు సమాచారం. విచారణకు ఎప్పుడూ హాజరవుతారనేది త్వరలోనే తెలియనుంది.

Next Story